రజినీకాంత్ కి డబుల్ బోనస్

Rajiniaknth

సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్”తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. ఈ సినిమా నిర్మాత కళానిధి మారన్ కి కళ్ళు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. తమిళ సినిమా రంగంలో కొత్త రికార్డులు సృష్టించిన ఈ సినిమాతో మారన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అందుకే లాభాలను హీరో రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ కి పంచారు.

Advertisement

“జైలర్” సినిమాకి రజినీకాంత్ దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ఇక ఇప్పుడు సినిమా విడుదల తర్వాత నిర్మాత మరో భారీ చెక్కు ఇచ్చారు. ఇది కూడా ఇంకో వంద కోట్లు ఉంటుంది అని టాక్. ఈ బోనస్ అమౌంట్ ఎంత అనేది తెలియదు కానీ భారీ మొత్తం అని అర్థం అవుతోంది.

అలాగే, రజినీకాంత్ కోసం బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ కి చెందిన కార్లను నాలుగు తీసుకొచ్చి ఆయన ఇంటి ముందు పెట్టారు. రజినీకాంత్ కి నచ్చినది సెలెక్ట్ చేశారు. రజినీకాంత్ ఆశ్చర్యపోయారు. ఫైనల్ గా బీఎండబ్ల్యూ (bmw X 7) కారు నచ్చింది అనడంతో ఆ కారు తాళాలు అందచేశారు నిర్మాత మారన్. సో, మొత్తంగా ఒక పారితోషికం, రెండు బోనస్ లు (భారీ చెక్, కారు) దక్కాయి రజినీకాంత్ కి.

దర్శకుడు నెల్సన్ కి కూడా పారితోషికం కాకుండా మరో బోనస్ చెక్ అందచేశారు మారన్.

“జైలర్” ఇంకా రన్ అవుతోంది. ఈ సినిమాకి ముందు రజినీకాంత్ కి అన్నీ అపజయాలు. అయినా, దీంతో భారీ హిట్ కొట్టారు.

Advertisement
 

More

Related Stories