ఆ దర్శకుడిని తీసెయ్యమన్నారు: రజినీకాంత్

Rajiniaknth

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా “జైలర్” అనే సినిమా పూర్తిచేశారు. ఆగస్టు 10న విడుదల కానుంది ఈ మూవీ. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఆ వేదికపై రజినీకాంత్ తన తాజా కెరీర్ గురించి మాట్లాడారు. అలాగే కొత్త తరం దర్శకులతో పనిచేస్తున్న అనుభవాలను పంచుకున్నారు.

“జైలర్” దర్శకుడు నెల్సన్ ఇంతకుముందు వరుణ్ డాక్టర్, కోకో వంటి చిత్రాలు తీశారు. ఐతే, విజయ్, పూజ హెగ్డే జంటగా ఆయన తీసిన “బీస్ట్” మాత్రం దారుణ పరాజయం పాలైంది. దాంతో, రజినీకాంత్ పై ఒత్తిడి పెరిగిందట.

“జైలర్ సినిమా కథని బీస్ట్ విడుదలకు ముందే చెప్పారు నెల్సన్. మేము వెంటనే జైలర్ మూవీని ప్రకటించాం. ఐతే, బీస్ట్ విడుదలై ఆడలేదు. దాంతో, నా మిత్రులు, డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెల్సన్ ని తీసెయ్యండి. వేరే పెద్ద దర్శకుడితో సినిమా చెయ్యండి అని చెప్పారు. కానీ నెల్సన్ టాలెంట్ ని, ఆయన కథని నేను నమ్మాను. అందుకే, షూటింగ్ పూర్తి చేసి ఇప్పుడు విడుదల చేస్తున్నాం,” అని తెలిపారు రజినీకాంత్.

తనలాంటి సీనియర్ హీరోలకు కథలు రాయడం అంత ఈజీ కాదు అనే భావనని వ్యక్తపరిచారు రజినీకాంత్.

Advertisement
 

More

Related Stories