కొత్త సీఎం… భారీగా విరాళాలు

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని కలిసి రూ.50 లక్షల చెక్ అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కి రజినీకాంత్ విరాళం ఇచ్చారు. అంతకుముందు అజిత్, సూర్య సహా ఇతర హీరోలు తమ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్ కి సాయం ప్రకటించారు.

గత ఏడాది కరోనా విలయ తాండవం చేసినప్పుడు తమిళ సినిమా పరిశ్రమలోని కార్మికులను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరితే తమిళ హీరోలు పెద్దగా స్పందించలేదు. తెలుగులో హీరోలు, దర్శకులు, నిర్మాతలు అందరూ తమ వంతు సాయం చేశారు. కానీ తమిళ హీరోలు మాత్రం తమ చెక్ పవర్ ని ఉపయోగించుకోలేదు.

ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రాగానే ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు కాబోలు తమిళ ఇండస్ట్రీ అంతా సీఎం ఆఫీస్ కి క్యూ కడుతోంది.

 

More

Related Stories