రాజకీయ దుమారంలో రజినీకాంత్

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ మొన్న విజయవాడలో చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేతలు వరుసపెట్టి రజినీకాంత్ ని విమర్శిస్తున్నారు.

గతవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజినీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ తో తన అనుబంధం గురించి మాట్లాడారు. అలాగే అదే వేదికపై రాజకీయాలు మాట్లాడను అని చెప్పిన రజినీకాంత్ తన మిత్రుడు చంద్రబాబు నాయుడి గురించి మాత్రం నాలుగు మాటలు చెప్తాను అంటూ ఆయన విజన్ ఎలా ఉంటుందో చెప్పారు.

హైదరాబాద్ ఈ రోజు అద్భుతంగా ఉంది ఆయన అప్పట్లో ఐటీ రంగం కోసం హైదరాబాద్ లో విశేష కృషి చేశారని రజినీకాంత్ చంద్రబాబుని పొగిడారు.

ఐతే, వైఎసార్సీ పార్టీ నేతలు మాత్రం రజినీకాంత్ ని తెగ తిడుతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఎన్టీఆర్ జపం చేస్తున్నాడు, అలాంటి నేతని పొగడడం ఏంటి అని రజినీకాంత్ ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని, లక్ష్మీ పార్వతి సహా వరుసగా వైఎస్సార్సీ పార్టీ నేతలు రజినీకాంత్ ని టార్గెట్ చేశారు.

ఈ వయసులో విమర్శలు, ప్రతివిమర్శలు ఎందుకనే ఉద్దేశంతోనే ఆయన రాజకీయాలకు దూరంగా ఉందామని నిర్ణయం తీసుకున్నారు. అందుకే, గత ఎన్నికల సందర్భంగా పార్టీ పెడతాను అని ప్రకటించి ఆ తరువాత విరమించుకున్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఐతే, ఆంధ్ర రాజకీయాల్లో ఆయన పేరు ఇప్పుడు మార్మోగుతోంది.

Advertisement
 

More

Related Stories