బాషాకి ‘ఆటో రిక్షా’ సింబల్!

Rajinikanth

“నేను ఆటోవాన్ని ఆటోవాన్ని…”అంటూ రజినీకాంత్ వేసుకున్న పాట, వేసిన స్టెప్ అప్పట్లో సంచలనం. “బాషా” సినిమాలోని ఈ పాట రజినీకాంత్ ని తమిళనాడులోని ప్రతి ఆటోవాలాని టచ్ చేసింది. అప్పటికే మాస్ హీరోగా టాప్ రేంజులో ఉన్న రజినీకాంత్… ఈ సినిమాతో సౌత్ సూపర్ స్టార్ గా నిలిచారు. ఇప్పుడు రజినీకాంత్ 70 ఏళ్ళు. ఈ వయసులో ఆయన పార్టీ పెడుతున్నారు.

ఇటీవల ఢిల్లీ వెళ్లి తన పార్టీని ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించుకున్నారు. ఐతే పార్టీ పేరుని రజినీకాంత్ నెక్స్ట్ మంత్ ప్రకటిస్తారు.

పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్నది ఏంటంటే రజినీకాంత్ తన పార్టీ సింబల్ గా ఆటో గుర్తు కావాలని కోరారని టాక్. ఆయన సైకిల్ గుర్తుకి ప్రయత్నిస్తున్నారు అని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ “ఆటో” అయితేనే తన ఇమేజ్ కి బెటర్ అని ఆయన ఫిక్స్ అయ్యారట. ఎన్నికల సంఘం కూడా దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం.

మరోవైపు, రజినీకాంత్ పార్టీ పేరు గురించి ఎన్నో ఊహాగానాలు సాగుతున్నాయి. “మక్కల్ సేవై కచ్చి” (ఎం.ఎస్.కే) అనే పేరు దాదాపుగా ఖరారు అయిందని అంటున్నారు.

Advertisement
 

More

Related Stories