తప్పు తెలుసుకొని కట్టిన రజినీకాంత్

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ కోటీశ్వరుడు. వేలకోట్ల ఆస్తులున్నాయి. అలాగే, ఆయన ఛారిటీ కూడా ఎక్కువగానే చేస్తారు. ఎంత పెద్ద వారైనా, ఎక్కడో ఎప్పుడో ఒక చిన్న తప్పు చేస్తారు. అది వారి పరువుకు డ్యామేజ్ కలిగిస్తుంది. అదే జరిగింది చెన్నైలోని అయన నిర్వహించే “రాఘవేంద్ర కల్యాణ మండపం” విషయంలో.

ఈ హాల్ కి సంబంధించి ప్రాపర్టీ టాక్స్ కట్టేందుకు రజినీకాంత్ నిరాకరించారు. ఎందుకంటే… కరోనా టైంలో అసలు హాల్ నిర్వహించలేదనే వాదన తెచ్చారు. చెన్నై కార్పొరేషన్ ఈ విషయంలో గట్టిగా ఉండడడంతో …అయన హైకోర్టుకి వెళ్లారు. అక్కడే పరువు పోయింది.

రజినీకాంత్ కి కోర్టు అక్షింతలు వేసింది. కార్పొరేషన్ తో మాట్లాడుకొని…ఎంతో కొంతో కట్టకుండా లొల్లి ఏంటి అని మందలించింది. మీరు లాయర్ కి ఇచ్చే ఫీజు అంత లేని అమౌంట్ కోసం కోర్టుకొచ్చారా అని జడ్జి నిలదీయడంతో … రజినీకాంత్ తప్పు తెలుసుకున్నారు. “చెన్నై కార్పొరేషన్ లోనే అప్పీల్ చేసుకోవాల్సింది. ఈ తప్పు చెయ్యకుండా ఉండాల్సింది. అనుభవం ఒక పాఠం,” అంటూ ఆ తర్వాత ఆయన ట్వీట్ చేశారు.

దానికి తగ్గట్లే ఇప్పుడు మొత్తం అమౌంట్ కట్టేశారు. ఆరు నెలలకి కట్టాల్సిన 6.5 లక్షల టాక్స్ తో పాటు… మిగతా ఏడాదికి కూడా మరో ఆరు లక్షలు ముందే కట్టేశారు.

ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా… ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థల ముందు అందరితో సమానమే అని మరోసారి ప్రూవ్ అయింది.

Advertisement
 

More

Related Stories