
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ ఆకస్మిక మరణం అందరినీ కలిచివేసింది. తెలుగు చిత్రసీమ నుంచి నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవి, శ్రీకాంత్, వెంకటేష్, రానా బెంగుళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రామ్ చరణ్ పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రాజ్ కుమార్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ పునీత్ ని చివరి చూపు చూసేందుకు వెళ్లలేకపోయారు. ఎందుకంటే రజినీకాంత్ అప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రజినీకాంత్ కి అప్పుడు సర్జరీ జరిగింది.
ఈ రోజు ఆయన సోషల్ మీడియా వేదిక ద్వారా పునీత్ కి నివాళులు అర్పించారు. “నువ్వు లేవన్న నిజాన్ని అంగీకరించను. Rest in peace my child,” అని ట్వీట్ చేశారు రజినీకాంత్.
పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తో రజినీకాంత్ కి ఎంతో అనుబంధముంది.