పాతికేళ్ళు సాగిన ‘నాన్నా పులి’ ఆట!

Rajinikanth

“మా తలైవా సీఎం అవుతాడు….. ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నాడు…”

సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు 25 ఏళ్లుగా ఇదే మంత్రం వల్లించారు. రజినీకాంత్ కూడా తన రాజకీయ ఎంట్రీ గురించి 1990ల నుంచి ఊరిస్తూ వచ్చారు. “పడయప్పా” (తెలుగులో “నరసింహ”) సక్సెస్ తర్వాత ఆయన ఎన్నికల బరిలో దిగడం గ్యారెంటీ అని 20 ఏళ్ళ క్రితం పెద్ద రచ్చ జరిగింది. “దేవుడు ఆదేశిస్తే అడుగుపెడుతా” అని అప్పట్లో ప్రకటించారు రజినీకాంత్.

తన పవర్ ఏంటో… అప్పట్లోనే చూపించారు రజినీకాంత్.

“జయలలితకి ఓటేస్తే తమిళనాడు ప్రజలని ఆ దేవుడు కూడా కాపాడలేడు,” అని అప్పట్లో రజినీకాంత్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో జయలలిత ఓటమి చవిచూశారు. అంతటి పవర్ఫుల్ ఛరిస్మా రజనీకాంత్ ది. కానీ రజినీకాంత్ తన గేమ్ ని ఎక్కువ కాలం కొనసాగించాడు. పాతికేళ్ల క్రితమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలిసిన ఆయన 70 ఏళ్ల వయసులో ముచ్చట పడ్డారు. కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది.

కొన్నాళ్లుగా ఆయన సినిమాలు ఆడడం లేదు. మునుపటి ఇమేజ్, క్రేజ్ లేదు. యూత్ ఆయన మాటలని నమ్మే సీన్ లేదు. సీనియర్ సిటిజెన్ కి కూడా పెద్దగా నమ్మకం లేదు ఆయన ఈ ఏజ్ లో ఎదో చేస్తాడని. పైగా… రజినీకాంత్ బీజేపీ ఏజెంట్ అన్న మాట తమిళనాట బలంగా స్థిరపడిపోయింది.

25 ఏళ్ల పాటు “నాన్న పులి” అట ఆది… చివర్లో నిజంగానే పార్టీ పెడదామని అనుకుంటే… జనం నమ్మకుండా సైడ్ అయిపోయారని ఆయన గ్రహించారు. ఇటీవల ఒక సర్వే చేయించుకున్నారట. అందులో … జనం ఆయన పార్టీ పెడతాడని కానీ, ఆయన పార్టీ గెలుస్తుందని నమ్మడం లేదని తేలిందట. ఆయన ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో దిగితే 5 శాతానికి మించి ఓటు షేర్ రాబట్టుకోలేరని సర్వే చెప్పిందట.

అందుకే, ఆయన గౌరవప్రదంగా తన “రాజకీయ నాన్న పులి ఆట”కి స్వస్తి పలికారు.

More

Related Stories