బాలయ్యకే సాధ్యం: రజినీకాంత్

Balayya and Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ స్వర్గీయ నందమూరి తారక రామారావుకి వీరాభిమాని. శుక్రవారం జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజయవాడలో జరిగిన ఈ ఈవెంట్ లో పాల్గొని రజినీకాంత్ ఎన్టీఆర్ ని తాను ఎలా ఆరాధించారో చెప్పారు. అలాగే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనా దక్షత, ఆయన విజన్ గురించి కూడా చెప్పారు.

అప్పట్లో ఆయన హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి చెయ్యడం వల్లే అది ఇప్పుడు గొప్పగా హైదరాబాద్ అభివృద్ధికి కారకంగా మారింది అని అన్నారు రజినీకాంత్.

“ఇటీవల నేను జైలర్ షూటింగ్ కోసం జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ అవతల ఉన్న ఏరియా (మాదాపూర్, కొండాపూర్)లో తిరిగాను. నేను హైదరాబాద్ లో ఉన్నానా లేక న్యూయార్క్ లోనా అనే భావన కలిగింది. అప్పుడు చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు కూడా అద్భుతంగా చేస్తున్నారని చెప్పారు,” అని రజినీకాంత్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక బాలయ్యని పొగిడిన విధానం నవ్వులు పూయించింది. “ఆయన కంటి చూపుతో చంపేస్తాడు. ట్రైన్ ని ఆపుతాడు. అలాంటివి రజినీకాంత్ చేస్తే ఒప్పుకోరు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ చేసినా అంగీకరించారు. అది ఒక్క బాలయ్యకే సాధ్యం. ఎందుకంటే ఎన్టీ రామారావుగారిని బాలయ్యలో జనం చూస్తారు. అందుకే ఆయనని గొప్పగా ఆయన్ని యాక్సెప్ట్ చేశారు,” అని రజినీకాంత్.

Advertisement
 

More

Related Stories