పునరాలోచనలో రజినీకాంత్

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ “అన్నత్తే” అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కోసమని గత నెలలో హైదరాబాద్ వచ్చారు రజినీకాంత్. షూటింగ్ లొకేషన్లో బీపీ సమస్య రావడంతో అపోలో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దాంతో షూటింగ్ నిలిపివేశారు. అలాగే, అనారోగ్య సమస్యల కారణంగా తాను పార్టీ పెట్టలేను, రాజకీయాల్లోకి రాలేను అని ప్రకటించారు. అప్పటినుంచి ఇంటిపట్టునే ఉంటున్నారు సూపర్ స్టార్.

ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఆయన షూటింగ్ లో పాల్గొనాలి అనుకున్నారు. కానీ, తమిళనాడులో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి.

హెల్త్ సమస్య పేరు చెప్పి రాజకీయాలకు దూరం అంటున్న రజినీకాంత్ మరి షూటింగ్ లో మాత్రం ఎలా పార్టిసిపేట్ చేస్తారు? ఇదే ప్రశ్న వచ్చింది ఆయన విమర్శకుల నుంచి. దాంతో రజినీకాంత్ పునరాలోచనలో పడ్డారట. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చెయ్యకుండా … మరి కొన్నాళ్ళు ఆగాలనుకుంటున్నారు అని టాక్. అన్ని రాజకేయ పార్టీలు ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్నప్పుడు ఆయన సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేస్తారేమో.

“అన్నత్తే” దర్శకుడు శివ కూడా తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులు మొదలుపెట్టారని సమాచారం. సూర్య హీరోగా నటిస్తాడు ఆయన నెక్స్ట్ మూవీలో.

More

Related Stories