త్వరలో నిర్ణయం చెప్తా: రజిని

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ తన “రజిని మక్కల్ మండ్రమ్”కి చెందిన కీలక నేతలతో ఈ రోజు చెన్నైలో సమావేశం అయ్యారు. “రజిని మక్కల్ మండ్రమ్” అనేది ఒక ఫోరమ్. పార్టీ పెట్టె క్రమంలో కొన్నేళ్ల క్రితం దీన్ని ఏర్పాటు చేశారు రజినీకాంత్. ఇదే ఫోరమ్ ని ఆయన పార్టీ గా మలుస్తారు అని ఇన్నాళ్లు అంతా భావించారు. ఐతే, ఇంతకీ పార్టీ పెడుతారా లేదా? అనేది ఇంకా తేల్చలేదు.

“నా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మా నేతలు నాకు మాటిచ్చారు. నా నిర్ణయం వీలైనంత తొందర్లో చెప్తా,” అని రజినీకాంత్ మీడియాకు తెలిపారు. 2017 డిసెంబర్ 31న రజినీకాంత్ తాను రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు అఫీషయల్ గా ప్రకటించారు. మూడేళ్లు అయింది… ఇంకా పార్టీ విషయంలో తర్జన భర్జన కొనసాగుతోంది.

రజినీకాంత్ రాజకీయ పార్టీ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. అయితే, వయసు, ఆరోగ్యం వంటివి దృష్టిలో పెట్టుకొని ఆయన పార్టీ పెట్టి, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చెయ్యడం జరగదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రజినీకాంత్ మాత్రం ఈ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. రేపో, ఎల్లుండో ఈ విషయంలో క్లారిటీ రావొచ్చు.

కరోనా కారణంగా రజినీకాంత్ తన కొత్త సినిమా షూటింగ్ కూడా నిలిపివేశారు.

More

Related Stories