రజినీ నో, మరి బాలయ్య ఏమంటారో?

Bobby


‘వాల్తేర్ వీరయ్య’ సినిమా చూసి తెగ మెచ్చుకున్నా సూపర్ స్టార్ రజినీకాంత్ దర్శకుడు బాబీకి వెంటనే ఆఫర్ ఇచ్చారు అని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. రజినీకాంత్ తాజాగా రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నారు. ‘జైలర్’ షూటింగ్ పూర్తి చేసి తన కూతురు ఐశ్వర్య డైరెక్షన్ లో ‘లాల్ సలాం’ షూటింగ్ షురూ చేశారు.

ఇక ఈ రెండు కాకుండా మరో రెండు సినిమాలు అంగీకరించారు. ఒకటి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఉంటుంది. మరో సినిమాకి ‘జై భీం’ తీసిన జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తారు. దాంతో బాబీ – రజినీకాంత్ కాంబినేషన్ అనేది గాలి వార్త అని తేలింది.

ఇప్పుడు తాజా ప్రచారం ఏంటంటే ‘వాల్తేర్ వీరయ్య’ దర్శకుడికి బాలయ్య డేట్స్ ఇచ్చారని. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది అని అంటున్నారు.

ఐతే ఇక్కడ తిరకాసు ఉంది. దర్శకుడు బోయపాటి కూడా తదుపరి చిత్రం తనదే అంటున్నారు. వచ్చే నెలలోనే బాలయ్యతో తన నాలుగో చిత్రానికి ముహూర్తం ఉంటుంది అని చెప్తున్నారు. మరి, బాలయ్య బోయపాటితో వెళ్తారా? బాబీతోనే? వెయిట్ అండ్ సీ.

 

More

Related Stories