ప్లీజ్ లొల్లి చేయకండి: రజినీ

Rajinikanth

రాజకీయపార్టీ పెట్టట్లేదు అని రజనీకాంత్ నుంచి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. 70 ఏళ్ల వయసు, హెల్త్ కండిషన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రజినీకాంత్ ఇప్పటికే అభిమానులకు లెటర్ రాసి మమ అనిపించారు. అందరూ సైలెంట్ అయిపోయారనిపించింది. కానీ ప్రకటన వచ్చిన 10 రోజుల తర్వాత అభిమానులు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టడం వెరైటీ.

రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టాల్సిందే, మీ నిర్ణయమని మార్చుకొండి అంటూ ఆయన ఇంటివద్ద, చెన్నైలో పలుచోట్ల ఆందోళనకు దిగారు. “వా తలైవ వా” (రా తలైవా రా) అంటూ ఆదివారం చెన్నైలో అభిమాన సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. దాంతో రజినీకాంత్ స్పందించక తప్పలేదు. ఈ రోజు అయన అభిమానులనుద్దేశించి మరో లెటర్ విడుదల చేశారు.

“నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఈ విషయంలో గొడవ చెయ్యకండి. నేను ఎందుకు రాజకీయాల ఆలోచన విరమించుకున్నానో ఇప్పటికే స్పష్టం చేశాను. దయచేసి మళ్ళీ దీని గురించి అడగొద్దు,” అని లెటర్లో పేర్కొన్నాడు.

More

Related Stories