కూతురి కాపురం నిలబెట్టాలని…!

- Advertisement -


సూపర్ స్టార్ రజినీకాంత్ కి రిటైర్మెంట్ వయసులో ఎన్నో కష్టాలు. ఆయన సినిమాలు ఆడడం లేదు. ఒకప్పటి క్రేజ్ ఇప్పుడు లేదు. ఆరోగ్య ఇబ్బందులు. దానికితోడు ఇప్పుడు కూతురి విడాకుల సమస్య.

70 ఏళ్ల రజినీకాంత్ కూతురు ఐశ్వర్య భర్త ధనుష్ నుంచి విడిపోతుందని ఊహించలేదు. ధనుష్, కూతురు ఐశ్వర్య తీసుకున్న నిర్ణయం రజినీకాంత్ కి అస్సలు నచ్చలేదట. వారి సమస్యలు ఆయనకి పూర్తిగా తెలుసు. వారి మధ్య ఉన్న గొడవలు కూడా అర్థం చేసుకున్నారు. అయినా, ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చని, వాటికోసం విడిపోనవసరం లేదని రజినీకాంత్ కూతురికి, అల్లుడుకి నచ్చ చెప్తున్నారట.

ఇద్దరూ రాజీపడి, డివోర్స్ నిర్ణయాన్ని మార్చుకునేలా తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారని తమిళ మీడియా టాక్.

ఐతే, ధనుష్, ఐశ్వర్యల ఆలోచన ఎలా ఉందో. ప్రస్తుతం వారిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉండడం విశేషం. ధనుష్ ‘సార్’ అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ఆమె ఒక వీడియో ఆల్బమ్ డైరెక్ట్ చేస్తోంది.

 

More

Related Stories