‘అర్థమైందా రాజా’ రజినీ వైరల్ స్పీచ్!

- Advertisement -
Rajiniaknth

సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలం తర్వాత అద్భుతమైన స్పీచ్. ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలు అన్నా, ఆయన మీటింగ్ లు అన్నా పంచ్ పంచ్ డైలాగులు, జీవితానికి సంబంధించి పనికొచ్చే కొటేషన్లు ఉండేవి. ఐతే…. ఇటీవల కాలంలో రజినీకాంత్ సినిమాల్లో, స్పీచ్ ల్లో దమ్ము ఉండడం లేదు.

అందుకే కాబోలు “జైలర్” మ్యూజిక్ లాంచ్ కార్యక్రమంలో రజినీకాంత్ మరోసారి అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ని తాజాగా సన్ టీవీ తన యూట్యూబ్ లో షేర్ చేసింది. అందులో 40 సెకండ్ల స్పీచ్ ఇప్పుడు ఇంటర్నెట్ ని ఊపేస్తోంది.

రజినీకాంత్ తమిళ్ లో మాట్లాడారు. కానీ దానికి అనువాదం చేసి మీమ్స్ రూపొందించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇంతకీ ఆయన ఏమ్మన్నారో చూద్దాం.

“మొరగని కుక్కలు ఉండవు. ఇతరుల గురించి మాట్లాడని నోళ్లు ఉండవు. ఈ రెండూ లేని ఊళ్లు అస్సలే లేవు. అందుకే మన పని మనం చేసుకుంటూ పోవాలి. అర్థమైందా రాజా…”

తమిళంలో ఈ మాటలు చెప్పి చివర్లో తెలుగులో “అర్థమైందా రాజా” అని ముగించారు రజినీకాంత్. జీవితంలో ఎవరైనా ఇతరుల కామెంట్స్, విమర్శలు పట్టించుకోవద్దని ఆయన చెప్పిన విధానం అందరికీ నచ్చింది.

More

Related Stories