రజినీ నిర్ణయమే కరెక్ట్ అయిందిగా!

Rajinikanth

పార్టీ పెడతాను, తమిళనాడు ఎన్నికల్లో పోటీచేస్తానని ఆర్భాటంగా ప్రకటించి చివరి నిమిషంలో తప్పుకున్నారు రజినీకాంత్. దాంతో రజినీకాంత్ చాలా ట్రోలింగ్ కి గురయ్యారు. 20 ఏళ్ల పాటు ఊరించి తుస్సుమనిపించారని విమర్శలు వచ్చాయి. ఐతే, రజినీకాంత్ ఎన్నో సర్వేలు చేయించుకున్న తర్వాతే ఎన్నికల బరిలోకి దిగొద్దని డిసైడైన మాట వాస్తవం.

ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత రజినీకాంత్ నిర్ణయం సరైందే అనే కామెంట్ వస్తోంది. కమల్ హాసన్ పార్టీ స్థాపించి, కార్యకర్తలను తయారు చేసుకొని మూడేళ్ళుగా పోరాటం చేస్తున్నారు. అయినా… ఫలితం దక్కలేదు. ఆయన తన సొంత సీటును కూడా గెలవలేకపోయారు. ఇక ఆయన పార్టీ ఎక్కడా కనీసమాత్రంగా కూడా ప్రభావం చూపలేదు. దశాబ్దాలుగా నంబర్ వన్ హీరోగా కొనసాగిన రజినీకాంత్ రాజకీయాల్లో అలాంటి ఘోర పరాభవం చూసి ఉంటే ఎలా ఉండేది?

అందుకే, రజినీకాంత్ తప్పుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ మనిషిగా ముద్రపడిన తనను తమిళనాడు జనం ఆదరించరు అని అర్థం చేసుకున్నారు. డ్రాప్ అయి గౌరవం నిలబెట్టుకున్నారు.

Advertisement
 

More

Related Stories