రియా కొత్త ఫొటోల కలకలం

Rhea and Rajeev Lakshman

డ్రగ్స్ కేసులో బెయిల్ పై బైటికి వచ్చాక రియా చక్రవర్తి మీడియాతో మాట్లాడటం లేదు. తన జీవితం తనది అన్నట్లుగా సైలెంట్ అయిపోయింది. ఐతే 2021లో జీవితాన్ని ఫ్రెష్ గా రీస్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయినట్లుంది రియా. అందుకే, ముంబైలో కొత్త ఇల్లు అద్దెకు తీసుకునేందుకు తమ్ముడితో కలిసి అన్ని వీధులు తిరుగుతోంది. అలాగే, మళ్ళీ సినిమాల్లో నటించేందుకు ఫిల్మ్ మేకర్స్ ని కలుస్తోంది. పాత ఫ్రెండ్స్ ని పలకరిస్తోంది.

ఆ ప్రాసెస్ లో రాజీవ్ లక్ష్మణ్ అనే అతన్ని కూడా కలిసింది. అతను “రోడీస్” అనే టీవీ షోతో పాపులర్ అయ్యాడు. ఆమెని హగ్ చేసుకొని నవ్వుతూ పోజులిచ్చిన ఒక ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. “మై గర్ల్” అంటూ ఆ ఫోటోకి కాప్షన్ పెట్టడంతో కలకలం రేగింది. రియా మళ్ళీ ప్రేమలో పడింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు.

సుశాంత్ సింగ్ రాజపుత్ చనిపోయినప్పటి నుంచి ఆమెని విలనుగా చూస్తున్న ఆయన అభిమానులు … ఈ కొత్త ఫోటోని బాగా వైరల్ చేసి ఆమెని బద్నామ్ చేసే పనిలో పడ్డారు. దాంతో, వెంటనే రాజీవ్ లక్ష్మణ్ ఆ ఫోటోని డిలీట్ చేశాడు. “నేను రాసిన కొన్ని పదాలతో అనవసర సమస్యని క్రియేట్ చేశాను. క్షమించండి. రియా మంచి ఫ్రెండ్. చాలా నెలల తర్వాత ఆమె కలవడంతో ఆనందం వేసింది. ఆమెకి బెస్ట్ విషెస్. తప్పుగా రాయొద్దు,” అంటూ ఆయన మరో పోస్ట్ పెట్టాడు.

కానీ ఈలోపు రియా “మరో బట్టతలవాడిని పట్టేసింది” అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.

More

Related Stories