ఇళయరాజా స్టూడియోలో రజినీకాంత్

మేస్ట్రో ఇళయరాజాకి ఇన్నేళ్లకి సొంతంగా రికార్డింగ్ స్టూడియో కట్టుకున్నారు. చెన్నైలోని ప్రసాద్ స్టూడియోలో ఉన్న రికార్డింగ్ థియేటర్ ని 40 ఏళ్ల పాటు తన సొంత రికార్డింగ్ స్టూడియోలా వాడుకున్నారు ఇళయరాజా. ఐతే, ఈ రికార్డింగ్ థియేటర్ ని ఖాళీ చెయ్యాలని ప్రసాద్ స్టూడియో యాజమాన్యం కొన్నేళ్ల క్రితం ఇళయరాజాని కోరింది. కానీ రాజా వారికి వ్యతిరేకంగా లీగల్ పోరాటం చేశారు. చాలా ఏళ్ళు కేసు నడిచింది.

కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు రాలేదు. దాంతో, రీసెంట్ గా చెన్నైలోనే కోడంబాకం ఏరియాలోనే సొంతంగా స్టూడియో కట్టుకున్నారు. ఇప్పుడు ఇళయరాజా తన పాటలను అక్కడే రికార్డు చేస్తున్నారు.

రాజాతో దశాబ్దాల అనుబంధం ఉన్న రజినీకాంత్ ఈ స్టూడియో చూసేందుకు వచ్చారు. మంగళవారం (ఫిబ్రవరి 16, 2021) ఆయన స్టూడియోకి వచ్చి రాజా పాటలు రికార్డ్ చేస్తున్న తీరుని పరిశీలించారు. నాటి “పదహారేళ్ళ వయసు” (తమిళ్ వర్షన్) నుంచి 1994లో విడుదలైన “వీర” వరకు రాజా రజినీకాంత్ కి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. రజినీకాంత్ సూపర్ స్టార్ కావడంలో రజినీకాంత్ పాటల పాత్ర చాలా ఉంది.

More

Related Stories