ప్రచారం కోసం ‘భర్తలను’ వాడుతోందా?

రాఖీ సావంత్… ఏ సినిమాలో యాక్ట్ చేసింది అని అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం. ఆమె సినిమాలతో పాపులర్ కాలేదు. వివాదాలతో, పబ్లిసిటీ గిమ్మిక్ లతో మాత్రం ఎప్పుడూ వార్తల్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే… ఆమె చేసుకున్నానని పెళ్లిళ్లు మరో ఇండియన్ హీరోయిన్ చేసుకోలేదు.

ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. ఐతే, తాజాగా తేలింది ఏంటంటే… ఆమె పెళ్లిళ్లు అన్ని ఉత్తిత్తి పెళ్లిళ్లే. ఈయన నా భర్త, నా పెళ్లి అయింది అని ఇలా నాలుగు సార్లు హడావిడి చేసింది. కానీ ఆ నలుగురు డమ్మీ భర్తలేనట. అంటే వారితో ఆమెకి పెళ్లి కాలేదు. పబ్లిసిటీ కోసం అలా చేసిందని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి.

అంటే ఆమె మొగుళ్ళని తన సెల్ఫ్ ప్రచారం కోసం వాడుకుంటుందన్నమాట. అన్నిటికన్నా జోక్ ఏంటంటే… ఆమె తన భర్తగా చెప్పుకున్న వారిలో ఒకరు ఏకంగా “గే”నట. సినిమా హీరో, హీరోయిన్లు తమ గురించి జనం మాట్లాడుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ డమ్మీ మొగుళ్ళతో ప్రచారమా పొందొచ్చు అని రాఖి ప్రూవ్ చేసింది.

More

Related Stories