నిజంగా నేను తాగను: రకుల్

Rakul

రకుల్ ప్రీత్ సింగ్ కు తాగే అలవాటు లేదంట. మందు తాగను, సిగరెట్ తాగను అంటోంది. ఆమె ఇటీవల కోర్టులో వేసిన పిటిషన్లో ఇలా చెప్పింది. తాను టీటోటలర్ (ఆల్కహాల్ పుచ్చుకొని వారిని అలా అంటారు ఇంగ్లీషులో) అని పేర్కొంది. సినిమాల్లో పాత్ర డిమాండ్ చేసిన మేరకు సిగరెట్ స్మోక్ చేసినట్లు, మందు తాగినట్లు “యాక్టింగ్” చేశాను తప్ప నిజజీవితంలో తాగలేదు అని చెప్పింది.

పార్టీల్లో కానీ, మరెప్పుడైనా కానీ డ్రగ్స్ తీసుకున్నది, లేనిది మాత్రం మెన్షన్ చెయ్యలేదు.

Also READ: డ్రగ్స్ ఆరోపణలు ఖండించిన దియా

మరోవైపు, రకుల్ కి కూడా ఈ వారమే సమన్లు పంపిస్తామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెప్తున్నారు. రకుల్ తో పాటు, సారా అలీ ఖాన్, శ్రద్ధ కపూర్ లను విచారణకి రమ్మని పిలుస్తారట. ఐతే, ఇది సాధారణ విచారణే. సుశాంత్ సింగ్, రీయా కేసులో విచారణలో భాగంగా మాత్రమే వారి వర్సన్ రికార్డు చేస్తారు.

Also READ: ‘శ్రద్ధ కోసమే గంజాయి ఆయిల్ కొన్నా’

Related Stories