అక్కడికి వెళ్లినా అదే సీన్

Rakul Preet Singh


తెలుగులో వరుసగా అపజయాలు వచ్చాయి రకుల్ కి. దాంతో, ఆమెని కన్సిడర్ చెయ్యడం మానేశారు తెలుగు ఫిలింమేకర్స్. దాంతో, ఆమె టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. ముంబైలో ఆమె దశ తిరిగింది. ఒకేసారి డజన్ వరకు సినిమాలు ఒప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ బ్యూటీ.

బాలీవుడ్ అగ్ర నిర్మాత కొడుకు జాకీ భగ్నానీతో డేటింగ్ కూడా మొదలుపెట్టింది. దాంతో, ఆమె బాలీవుడ్ లో దూసుకెళ్తున్నట్లు అనిపించింది.

ఐతే, ఆఫర్లు ఎక్కువే వచ్చినా ఫలితం మాత్రం మారలేదు. తెలుగులో ఎలా అయితే అపజయాలు చూసిందో హిందీలో కూడా అదే సీన్ చూస్తోంది.

ఈ ఏడాది ఆమె నటించిన ఐదు సినిమాలు విడుదల కావడం విశేషం. అటాక్, రన్ వే 34, కట్ పుతిలి, డాక్టర్ జి, థాంక్యూ… ఇవి ఆమె నుంచి వచ్చిన ఐదు చిత్రాలు. జాన్ అబ్రహం, అజయ్ దేవగన్, ఆయుష్మాన్ ఖురానా, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి పేరొందిన హీరోలు నటించిన సినిమాలే ఇవి. కానీ ఒక్కటీ కూడా కనీస స్థాయి ఓపెనింగ్స్ సాధించలేదు.

రకుల్ చేతిలో చాలా సినిమాలు ఉన్న మాట వాస్తవమే కానీ సక్సెస్ రేట్ మాత్రం జీరో. వచ్చే ఏడాది మరో ఐదు సినిమాలు విడుదల కానున్నాయి. అవైనా హిట్ అవుతాయా అన్నది చూడాలి.

 

More

Related Stories