మళ్లీ ల్యాండ్ అయిన రకుల్

డ్రగ్స్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన రకుల్ మళ్లీ హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా రకుల్ పేరు తెరపైకొచ్చింది. క్రిష్ దర్శకత్వంలో హైదరాబాద్ లో సినిమా చేస్తున్న టైమ్ లో ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) నుంచి నోటీసులు అందుకుంది రకుల్. దీంతో క్రిష్ సినిమాకు బ్రేకులు పడ్డాయి.

విచారణ కోసం ముంబయి వెళ్లిపోయింది రకుల్. తిరిగి ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందో అనే అనుమానాలు అందర్లో పెరిగాయి. కానీ రకుల్ మాత్రం విచారణ ముగించుకొని నిన్ననే మళ్లీ హైదరాబాద్ వచ్చేసింది. ఈ వారం తిరిగి క్రిష్ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుంది. 

Related Stories