పెళ్లి మాటే ఎత్తడం లేదుగా!

Rakul Preet Singh

2022లో రకుల్ తన ప్రేమ విషయాన్ని పబ్లిక్ గా బయటపెట్టింది. బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది. అప్పటి నుంచి వీరి పెళ్లి గురించి చాలా కథనాలు వచ్చాయి. కానీ ఏడాదిన్నర తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు ఈ భామ.

అలాగనీ, జాకీతో బ్రేకప్ కాలేదు. కానీ ఎందుకో ఈ భామ పెళ్లి గురించి ఇప్పుడు ప్రస్తావన తేవడం లేదు. నటిగా కూడా బిజీగా లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒకే ఒక్క చిత్రం సెట్స్ పై ఉంది. మిగతావన్నీ విడుదలయి పోయాయి.

ఆమె ప్లానింగ్ ఏంటో అర్థం కావడం లేదు అంటున్నారు బాలీవుడ్ జనం.

ప్రస్తుతం ఆమె తన సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోటోషూట్ లు అప్డేట్ చేస్తూ హడావిడి చేస్తుంది. సినిమాల అప్డేట్స్ తగ్గిపోయాయి. ఇక తెలుగులో ఐతే కొత్తగా ఆఫర్లే రావడం లేదు. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా హీరోగా సినిమాలు చెయ్యడం లేదు. నిర్మాతగా సినిమాలు పెద్దగా లేవు. అతను ఖాళీనే. మరి, ఇద్దరూ పెళ్లి ఊసు ఎందుకు ఎత్తడం లేదు?

More

Related Stories