
రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నట్టుండి బాలీవుడ్ లో బిజీ అవుతోంది. డ్రగ్స్ వివాదం ఆమెకి అవకాశాలను హరిస్తుంది అనుకున్నారు. కానీ ఆ కేసులో ఆమె తప్పేమి లేదని, ఆమెని అనవసరంగా ఇరికించే ప్రయత్నం జరిగిందని తేలడంతో రకుల్ కి మంచే జరిగింది. ఇప్పుడు ఫుల్ గా ఆఫర్లు వస్తున్నాయి.
ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ నుంచి మరో బాలీవుడ్ మూవీ అనౌన్స్ మెంట్ వచ్చింది.
అజయ్ దేవగన్, సిద్దార్థ్ మల్హోత్రా హీరోలుగా ఇంద్ర కుమార్ డైరెక్షన్లో రూపొందే “థాంక్ గాడ్” అనే సినిమాలో హీరోయిన్ గా రకుల్ నటించనుంది. ఇప్పటికే ఆమె అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “మే డే” అనే సినిమాలో నటిస్తోంది. అంటే, అజయ్ దేవగన్ తో ఆమెకిది వరుసగా రెండో చిత్రం ఈ ఏడాది.
లాస్ట్ ఇయర్ కూడా అజయ్ దేవగన్ హీరోగా విడుదలైన “దే దే ప్యార్ దే” సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించింది. అంటే రెండేళ్లలో అజయ్ సరసన మూడు చిత్రాలు రకుల్ ఖాతాలో పడుతున్నాయి.
అజయ్ దేవగన్ 50 దాటాడు. అందుకే తన వయసుకు సూట్ అయ్యే హీరోయిన్లతో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. 30 ప్లస్ లో ఉన్న రకుల్ కి అందుకే వరుస ఆఫర్లు దక్కుతున్నాయి. ఆమె తెలుగులో కూడా నాగార్జున వంటి సీనియర్ హీరో సరసన నటించింది. అలాగే, యువ హీరోల చిత్రాల్లో కూడా నటిస్తోంది.