రకుల్ పెళ్ళికి అలియా సిబ్బంది

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ ఈ నెల 21న పెళ్లి చేసుకోనుంది. గోవాలో ఆమె పెళ్లి. ఇప్పటికే రకుల్ కుటుంబ సభ్యులు, ఆమె కాబోయే భర్త కుటుంబం గోవా తరలి వెళ్ళింది. అక్కడే వారం మకాం. మూడు రోజుల పాటు పెళ్లి వేడుక జరుగుతుంది.

రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా గోవా బయలుదేరి వెళ్ళింది. రకుల్ కి ప్రగ్యా క్లోజ్ ఫ్రెండ్.

ఇక గోవాలో పెళ్లి వేడుక వద్ద సాధారణ జనం రాకుండా ఆమె భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొంది. అలియా భట్ సెక్యూరిటీ సిబ్బందిని రకుల్ ప్రీత్ సింగ్ తీసుకొంది. రకుల్ పెళ్లి వేడుక ముగిసేవరకు అలియా సెక్యూరిటీ అక్కడే ఉంటుంది.

రకుల్, జాకీ భగ్నానీ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కటవుతున్నారు.

 

More

Related Stories