రకుల్ ని తొలగించలేదంట!

శంకర్ ఉన్నట్టుండి ‘భారతీయుడు 2’ సినిమాని మొదలుపెడుతున్నారు. కొన్ని నెలల షూటింగ్ తర్వాత రెండేళ్ల పాటు ఆగిపోయిన ‘భారతీయుడు 2’ ఈ నెలాఖరు నుంచి మళ్ళీ ప్రారంభం కానుంది. కమల్ హాసన్ తన గెటప్ ని తీర్చిదిద్దుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ కూడా వచ్చేనెల నుంచి షూటింగ్ లో పాల్గొంటాను అని కాల్షీట్లు ఇచ్చింది. ఆమె కూడా బరువు తగ్గే పనిలో ఉంది.

ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్న రకుల్ సంగతేంటి? ఆమెని తొలగించి మరో హాటెస్ట్ హీరోయిన్ ని పెడుతారు అని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. ఎందుకంటే, ఇప్పుడు సౌత్ లో రకుల్ కి పెద్దగా క్రేజ్ లేదు. పైగా ఆమెపై పెద్దగా సీన్లు తీయలేదు. సో, ఇంకో హీరోయిన్ ని పెట్టి మళ్ళీ సీన్లు తీయొచ్చు.

కానీ, శంకర్ మాత్రం తాను ‘భారతీయుడు 2’ మొదలుపెట్టినప్పుడు ఏఏ నటులను తీసుకున్నారో వాళ్లెవరినీ తొలగించడం లేదంట. రకుల్ డేట్స్ కూడా తాజాగా కోరినట్లు సమాచారం. సో.. రకుల్ ఖాతాలో మరో భారీ చిత్రం దక్కింది.

రకుల్ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయింది. ఆమె నటించిన తెలుగు సినిమాలేవి ఇటీవల విజయం సాధించలేదు. దాంతో, తెలుగు దర్శక, నిర్మాతలు ఆమెని తమ సినిమాల్లో పరీశీలించడం లేదు. పాత్రలు ఇవ్వడం లేదు. హిందీలో మాత్రం అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వంటి హీరోల చిత్రాల్లో ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. ఆమె చేతిలో ఇంకా 5 హిందీ సినిమాలున్నాయి.

ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో పాటు ‘భారతీయుడు 2’ పాన్ ఇండియా చిత్రం కూడా ఖాతాలో చేరింది. ఇందులో ఆమె సిద్ధార్థ్ సరసన నటిస్తుందట. సిద్ధార్థ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

 

More

Related Stories