- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి చాలా చర్చ జరుగుతోంది. త్వరలోనే తన కొత్త బాయ్ ఫ్రెండ్ ని పెళ్లాడనుందని మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. దాంతో ఆమె స్పందించింది. పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్ చేసుకోలేదని క్లారిటీ ఇచ్చింది.
ఆమె ప్రస్తుతం బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉంది.
“నేను, జాకీ ప్రేమించుకుంటున్న విషయాన్ని పబ్లిక్ గా ప్రకటించాం. మా ప్రేమ వ్యవహారాన్ని దాయలేదు కదా! పెళ్లి విషయంలో కూడా అలాగే ఉంటాం. పెళ్లి ముహూర్తం గురించి ఆలోచిస్తే మీడియాకు తెలియజేస్తాను. కాబట్టి ఊహాగానాలు వద్దు,” అని మీడియాని కోరింది.
రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో దాదాపు 10 హిందీ చిత్రాలున్నాయి. కెరియర్ ఇంత బాగున్న టైంలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకొని అవకాశాలు పాడు చేసుకోదు.