
రకుల్ ప్రీత్ సింగ్ సరికొత్త ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. ముంబైలో ఏ ఫ్యాషన్ ఈవెంట్ జరిగినా ఈ భామని పిలుస్తున్నారు. ఏ అవార్డు ఫంక్షన్ నిర్వహించినా రకుల్ ఉండాల్సిందే. ఈ ఈవెంట్స్ కి ఆమె కొత్త కొత్త పద్ధతులు డ్రెస్ అప్ అయి వెళ్తోంది. అలా ఫ్యాషన్ ఐకానయింది.
అయితే, ఇప్పటివరకు ఆమె ధరించిన డ్రెస్సులు ఒక ఎత్తు నిన్న (ఏప్రిల్ 26) జీక్యూ అనే మేగజైన్ అవార్డుకి ఆమె హాజరయిన తీరు మరో ఎత్తు. అటు డీప్ నెక్ అందాలు, ఇటు తొడల సౌందర్యాలు ప్రదరిస్తూ ఒక రేంజ్ లో రెచ్చిపోయింది.
ఈ ఈవెంట్ కి హాట్ హాట్ డ్రెస్సులు ధరించి పలువురు బాలీవుడ్ భామలు విచ్చేసినా…. అందరి చూపులు మాత్రం రకుల్ పైనే. తన డ్రెస్సింగ్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది.
బాలీవుడ్ లో భామ హీరోయిన్ గా బిజీగానే ఉంది. ఐతే, సక్సెస్ లు మాత్రం లేవు. గత మూడేళ్ళ కాలంలో ఆమె పది సినిమాల్లో నటించింది. ఆ పది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అంటే, 100 పెర్సెంట్ ఫ్లాపులు ఉన్న భామ రకుల్. అయినా కూడా ఆమెకి ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అలాగే, ఇలా ఫ్యాషన్ ఈవెంట్లు, అవార్డుల ఈవెంట్లకు కూడా ప్రత్యేక పిలుపులు దక్కుతున్నాయి.