‘నా లైఫ్ స్టయిలే నన్ను కాపాడింది’

Rakul

కరోనా బారిన పడిన రకుల్ ప్రీత్ సింగ్ స్పీడ్ గా కోలుకొంది. కేవలం పదిరోజుల్లోనే పాజిటివ్ నుంచి నెగెటివ్ కి వచ్చింది.

“స్పీడ్ గా కోలుకోవడానికి కారణం నా లైఫ్ స్టైల్. నాకు మొదటినుంచి హెల్త్ అండ్ ఫిట్ నెస్ పై శ్రద్ద ఎక్కువ. ప్రతిరోజూ ఎక్సర్ సైజ్ చేస్తా. యోగ చేస్తా. దానికి తోడు, క్వారంటైన్ పీరియడ్ లో పూర్తిగా న్యూట్రిసియస్ ఫుడ్ తీసుకున్నా. మా అమ్మ హైదరాబాద్ కి వచ్చి నాతోనే ఉంది,” ఇలా తాను ఎలా స్పీడ్ గా కోలుకున్నదో చెప్పింది.

“మే డే” అనే బాలీవుడ్ సినిమా షూటింగ్ స్పాట్ లో ఆమెకి కరోనా వచ్చింది. పది రోజులు ఆమె కారణంగా షెడ్యూల్ మారింది. ఐతే, జనవరి 2 నుంచి మళ్ళీ షూటింగ్ లో పార్టిసిపేట్ అవుతుందట.

కరోనా వచ్చాక.. స్మెల్ కోల్పోవడం, రుచి తెలియకపోవటం అనేది జరుగుతుంది. కరోనా వచ్చాక… తనకి చిన్న చిన్న విషయాలే గొప్పవి అని తెలిసొచ్చింది అంటుంది. రుచి, వాసన అనేది ఎంత ముఖ్యమో అర్థమైంది. హ్యూమన్ టచ్ కున్న వేల్యూ తెలిసొచ్చిందట.

More

Related Stories