అన్ లాక్ మొదలైంది. డొమస్టిక్ విమానాలు తిరుగుతున్నాయి. అయినప్పటికీ హీరోహీరోయిన్లు విమాన ప్రయాణాలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇంకొన్ని రోజులు వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. అయితే రకుల్ మాత్రం తప్పనిసరి పరిస్థితుల మధ్య విమానం ఎక్కాల్సి వచ్చింది. దీంతో ఆమె కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
చూశారుగా.. ఇలా ముసుగురాణిలా ముస్తాబైంది రకుల్. పీపీఈ కిట్ ధరించింది. ముఖానికి ఎన్-95 మాస్క్ వేసుకుంది. తలకు ఫేస్ షీల్డ్ పెట్టింది. చేతులకు గ్లౌజులు వేసుకుంది. ఇలా పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాతే ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది రకుల్.
ముంబయి నుంచి ఢిల్లీకి వెళ్లింది రకుల్. “ఎటాక్” అనే సినిమా పని మీద ఢిల్లీకి వెళ్లింది రకుల్. ఆమెతో పాటు ఆ సినిమా దర్శకుడు రాజ్ ఆనంద్ కూడా ఢిల్లీకి ప్రయాణించాడు.
అన్ లాక్ లో భాగంగా ముంబయిలో ఆల్రెడీ జాగింగ్ చేసింది రకుల్. ఆ తర్వాత రోజు సైక్లింగ్ కూడా చేసింది. ఇప్పుడు ఇలా ఏకంగా విమానం ఎక్కింది. చూడ్డానికి కాస్త కామెడీగా ఉన్నప్పటికీ.. కొన్ని రోజుల పాటు విమాన ప్రయాణాలు చేసేవాళ్లు ఇలానే తయారవ్వడం బెటరేమో