అలా మారి ఏడాదయింది

సినిమా హీరోయిన్లు అందరూ వేగన్ గా మారిపోతున్నారు. వేగన్ అంటే కేవలం శాకాహారి మాత్రమే కాదు పాలు, పాల పదార్థాలు కూడా ముట్టరన్నమాట. ఫిట్ నెస్ తో పాటు జంతువులను హింసించొద్దు అనే కాన్సెప్ట్ తో సమంత, అలియా భట్, కంగనా… ఇలా పలువురు వేగన్ గా మారిపోయారు. ఈ లిస్ట్ లోకి రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరిందని మీడియా రాస్తోంది. తాజాగా రకుల్ స్పందించింది.

“నేను పూర్తిగా శాకాహారిగా మారిన మాట నిజమే. కానీ..నేను ఇప్పుడు మారలేదు. ఇప్పటికే ఏడాదిగా ఆలా మాంసంకి దూరంగా ఉంటున్నాను. పూర్తిగా వేగన్ గా మరి ఏడాది దాటిపోయింది,” అని చెప్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్ మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయింది. “డ్రగ్స్ కేస్” తెర మరుగు అయింది. దాంతో పూర్తిగా ఊపిరి పీల్చుకొంది రకుల్. ఇప్పుడు మునుపటిలా సోషల్ మీడియాలో పోస్ట్స్ తో అదరగొడుతోంది.

Related Stories