హిందీలో కూడా రకుల్ ఫేట్ అంతే!

- Advertisement -


టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన రకుల్ సక్సెస్ రేట్ మారలేదు. హిందీలో ఆమెకి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. చేతిలో అరడజను హిందీ చిత్రాలు ఉన్నాయంటే మాటలు కాదు. సినిమాలు ఉన్నా… విజయాలు మాత్రం దక్కడం లేదు.

గతేడాది తెలుగులో ‘చెక్’, ‘కొండపొలం’ చిత్రాలతో అపజయాలు మూటగట్టుకొంది. ఇక ఈ ఏడాది బాలీవుడ్ లో ‘అటాక్’, ‘రన్ వే 34’ అనే సీన్లు విడుదలయ్యాయి. ‘అటాక్’ ఏప్రిల్ 1న విడుదలయి దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక ‘రన్ వే 34’ ఏప్రిల్ 29న రిలీజయింది. కేవలం 11 కోట్ల రూపాయల ఓపెనింగ్ వచ్చింది ఈ మూవీకి. ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరో. అంత పెద్ద హీరో ఉన్నా… మొదటి వీకెండ్ ఇండియా అంతా 11 కోట్లు వచ్చాయంటే ఈ సినిమా రిజల్ట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.

రకుల్ కి బాలీవుడ్ లో కూడా సాలిడ్ హిట్ పడడం లేదు.

ఐతే, ఈ భామ నటిస్తున్న మరో ఐదు హిందీ చిత్రాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి. వచ్చే ఏడాది మరో రెండు విడుదల అవుతాయి. అంటే ఈ 7 చిత్రాల్లో ఒకటి రెండు అన్నా బ్లాక్ బస్టర్ అవుతాయా అన్నది చూడాలి.

 

More

Related Stories