ఆ కోరిక తీరలేదింకా: రకుల్

- Advertisement -
Rakul Preet Singh

రకుల్ ప్రీత్ సింగ్ ఒక కోరిక మిగిలిపోయిందట. బాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించింది. ఐతే, బాలీవుడ్ లో ఇప్పటివరకు ఫక్తూ మసాలా సాంగ్ చెయ్యలేదంటోంది. తెలుగు, తమిళ సినిమాల్లో అలాంటివి చేసింది. కానీ హిందీలో మాత్రం ఫుల్ మసాలా డాన్స్ చేసే ఛాన్స్ రాలేదంట.

ఆ ఒక్క కోరిక తీర్చుకునే అవకాశం కోసం చూస్తోంది. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో ఆరు సినిమాల్లో నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ముంబైలోనే ఉంటోంది. ఒక్కసారిగా ఆమె హిందీలో బిజీ కావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఐతే, ఆమె ఇప్పుడు ఒప్పుకున్న చిత్రాల్లో ఒక్కటి కూడా మసాలా సాంగ్ లేదంట.

ఇలా చెప్పడం ద్వారా ఆమె బాలీవుడు ఫిల్మ్ మేకర్స్ కి హింట్ ఇస్తోంది.

మరోవైపు. తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గలేదు కానీ తెలుగులో కొత్తగా సినిమాలు ఒప్పుకునేందుకు టైం లేదంటోంది.

 

More

Related Stories