రకుల్ వెకేషన్ కి రెడీ

Rakul

హీరోయిన్లంతా ఇప్పుడిప్పుడే సెట్స్ పైకి వస్తున్నారు. మొన్నటివరకు ఎప్పుడు తమ సినిమాలు స్టార్ట్ అవుతాయా అని కళ్లుకాయలు కాచేలా ఎదురుచూసిన ముద్దుగుమ్మలంతా, తమ సినిమాలు సెట్స్ పైకి వచ్చిన తర్వాత, ఎప్పుడు గ్యాప్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే, వీళ్లంతా విహారయాత్రలకు వెళ్లి చాన్నాళ్లయింది మరి. అలా వెయిట్ చేస్తున్న హీరోయిన్లలో రకుల్ ముందుంది.

గ్యాప్ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది ఈ బ్యూటీ. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న రకుల్.. త్వరలోనే మరో రెండు సినిమాలు స్టార్ట్ చేయాల్సి ఉందని.. ఆ రెండు సినిమాల గ్యాప్ లో టూర్ కు కచ్చితంగా వెళ్తానని చెబుతోంది

నితిన్ దర్శకత్వంలో ‘చెక్’ అనే సినిమా చేస్తోంది రకుల్. త్వరలోనే ఓ తమిళ సినిమా స్టార్ట్ చేయబోతోంది. ఈ రెండు సినిమాల మధ్య చిన్న గ్యాప్ తీసుకొని.. తన తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రకు వెళ్తుందట రకుల్.

ఎందుకంటే.. త్వరలోనే ఆమె తల్లిదండ్రుల పెళ్లి రోజు వస్తోందట. ఆ పెళ్లి రోజును కాస్త గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనేది రకుల్ ప్లాన్.

 

Related Stories