
బాలీవుడ్ లో లవర్ తో కలిసి వెకేషన్ కి వెళ్లడం అనే ట్రెండ్ ఉంది. అలియా భట్ – రణబీర్ కపూర్ రెగ్యులర్ గా వెకేషన్ కి వెళ్తుంటారు. సిద్ధార్త్ మల్హోత్రా – కియారా అద్వానీ, అనన్య పాండే – ఇషాన్ కట్టర్ …. ఇలా ఈ కొత్త ఏడాది సంబరాలను జరుపుకునేందుకు వెకేషన్ కి వెళ్లారు. ఆ జాబితాలో రకుల్ కూడా ఉంది.
రకుల్ ఇటీవలే ఒక యువ హీరోతో డేటింగ్ మొదలుపెట్టింది. జాకీ భగ్నానీ అనే యువ హీరోతో ఆమె ప్రేమలో ఉంది. ఇటీవలే వీరిద్దరూ తమ లవ్ గురించి ప్రపంచానికి తెలియచేశారు.
తాజాగా జాకీ భగ్నానీతో లండన్ వెళ్లింది. న్యూ ఇయర్ వేడుకలను అక్కడే జరుపుకొంది ఈ జంట.
రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీ. ఆమె చేతిలో దాదాపు 10 హిందీ సినిమాలున్నాయి. ఆమెకి అక్కడ ఎందుకో సడెన్ గా క్రేజ్ పెరిగింది. తెలుగులో ఆమె ఇటీవల చేసిన ఏ చిత్రం కూడా ఆడలేదు. దాంతో, ఆమెకి ఇక్కడ పాపులారిటీ తగ్గింది.