రకుల్ బయటపడింది

Rakul Preet Singh

రకుల్ కరోనా గండం నుంచి బయటపడింది. ఆమె కరోనా నుంచి కోలుకుంది. పది రోజుల క్రితం ఆమెకి కరోనా సోకింది. వెంటనే ఇంట్లోనే క్వారంటైన్ లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉండే ట్రీట్ మెంట్ తీసుకొంది. ఇప్పుడు ఆమెకి నెగెటివ్ వచ్చింది. ట్విట్టర్లో ఈ విషయాన్ని షేర్ చేసింది. ఆమె ఒక సినిమా షూటింగ్ లో పాల్గొన్నప్పుడు కరోనా సోకింది. కొత్త ఏడాదిలో అంతా మంచే జరుగుతుందని ఆశపడుతోంది.

రకుల్ కెరీర్ కి మళ్ళీ బూస్టప్ వచ్చింది. చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి పెద్ద బాలీవుడ్ మూవీ కూడా ఉండడం విశేషం.

రకుల్ ప్రీత్ సింగ్ ఆ మధ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కొంది. ఐతే, అందులో ఆమె తప్పు లేదని తర్వాత తేలింది. మొత్తానికి 2020 చివర్లో ఆమె లైఫ్ లో కొన్ని సంక్షోభాలను చూసింది. అవన్నీ ఇప్పుడు పోయాయి.

More

Related Stories