రకుల్ మూవీకి నెగెటివ్ మార్కులు

Rakul

రకుల్ ప్రీత్ సింగ్ నటించిన లేటెస్ట్ హిందీ మూవీ… ‘సర్దార్ కా గ్రాండ్ సన్’. అర్జున్ కపూర్ హీరో, రకుల్ హీరోయిన్. ఈ సినిమా ఈ రోజు డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదలయింది. క్రిటిక్స్ నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చారు. ఎన్డీటీవీ 1.5/5 రేటింగ్ ఇచ్చింది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ గెస్ట్ పాత్రలాంటిదే పోషించిందట. సినిమా ప్రారంభంలో కాసేపు… మళ్ళీ చివర్లో కనిపించి మాయం అవుతుందట. ఆమెకి పెద్దగా ప్రాధాన్యం లేదు. హిందీలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వద్దనడం లేదు రకుల్. చిన్న రోలా, పెద్దదా అనేది చూడడం లేదు… ఎప్పుడూ బిజీగా ఉండాలనేది ఆమె పాలసీ. ఇంకా మూడు హిందీ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

అలాగే తెలుగులో ఆమె క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ చేసింది. అదింకా విడుదల కాలేదు.

Advertisement
 

More

Related Stories