ఇక రామ్ తోనే వెళ్ళాలి!

- Advertisement -
Ram and Anil Ravipudi

రామ్ హీరోగా ‘రాజా ది గ్రేట్’ అనే సినిమాని తీయాలని ప్లాన్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమాకి సంబంధించి ప్రకటన కూడా వచ్చింది అప్పట్లో. కానీ ఎందుకనో ఆగిపోయింది. ఆ తర్వాత అదే కథని రవితేజ హీరోగా తీసి సక్సెస్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. మళ్ళీ ఇన్నేళ్లకి, వీరి కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది.

అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ మరోసారి దక్కుతుందని అనుకున్నాడు. కానీ, మధ్యలో త్రివిక్రమ్ దూరి అతని ప్లానింగ్ కి ఎసరు పెట్టాడు. మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ తో మూవీ చేయనున్నాడు.

సో, అనిల్ రావిపూడి మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. రామ్ తో వెళ్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాట్ట.

 

More

Related Stories