చరణ్ కి పోటీగా బన్నీ దూకుడు


రామ్ చరణ్, అల్లు అర్జున్ కి మధ్య ఒక రకమైన పోటీ అట్మాసిఫియర్ ఉంది. ఇద్దరూ కజిన్స్. కానీ ఇద్దరి మధ్య కాంపీటీషన్ కూడా తీవ్రంగానే ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రామ్ చరణ్ మరో మెగా షోమేన్ శంకర్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చెయ్యడంతో బన్నీ కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైనప్ చేసే పనిలో పడ్డాడట.

అందుకే, హడావిడిగా ప్రశాంత్ నీల్ తో మంతనాలు జరిపాడని టాక్. “పుష్ప” సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే, అటు ఇంతకుముందే ప్రకటించిన కొరటాల సినిమా మొదలు కాకముందే నీల్ ని తమ గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి రప్పించుకొని చర్చలు జరపడం విశేషం. చరణ్ కి ధీటుగా బడా దర్శకులతో బన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటున్నాడన్నమాట.

‘రంగస్థలం’ సినిమాతో రికార్డులు బ్రేక్ చేశాడు రామ్ చరణ్. “అల వైకుంఠపురంలో” సినిమాతో బన్నీ కూడా కొత్త రికార్డులు నెలకొల్పాడు. ఇప్పుడు “ఆర్ ఆర్ ఆర్”తో చరణ్ మరో మెట్టు ఎక్కుతాడు. శంకర్ సినిమా కూడా మామూలుగా ఉండదు. సో, బన్నీ కూడా పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు.

More

Related Stories