రామ్ చరణ్ తోనే ఇంకోసారి

Sukumar


రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ‘రంగస్థలం’ వచ్చింది. అది ఎంత పెద్ద హిట్టో చెప్పక్కర్లేదు. తాజాగా, వీరి కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అయింది. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తోనే మూవీ చేస్తారట. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇటీవల చరణ్, సుకుమార్ కలుసుకొని 2024లో సినిమా స్టార్ట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.

‘పుష్ప 2’ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా అనుకున్నారు సుకుమార్. ఐతే, సుకుమార్ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. అందుకే, విజయ్ తో కాకుండా పాన్ ఇండియా స్టార్ డం ఉన్న చరణ్ తోనే సినిమా తీయాలనుకుంటున్నారు. ‘లైగర్’ ఫ్లాప్ కావడంతో ఈక్వేషన్లు మారిపోయాయి. అలా, విజయ్ కి హ్యాండిచ్చారు సుకుమార్.

సుకుమార్ తప్పుకోవడంతో విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త సినిమాలు ఒప్పుకునే పనిలో పడ్డాడు. త్వరలోనే రెండు కొత్త సినిమాల ప్రకటన వస్తుంది విజయ్ దేవరకొండ నుంచి.

ఇక సుకుమార్ – రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన ప్రకటన పుష్ప 2 చివరి దశలో ఉండగా వస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్న లెక్క. దర్శకుడిగా తన రేంజ్ పాన్ ఇండియా లో ఉందని భావిస్తున్న సుకుమార్ దానికి తగ్గ సినిమాలు, హీరోలను ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. మార్కెట్ ముఖ్యం బిగిలూ!

 

More

Related Stories