వేరే దర్శకులతో చరణ్ చర్చలు

Ram Charan


‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి రామ్ చరణ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. ‘జెర్సీ’ చూడగానే చరణ్ బాగా ఎక్సయిట్ అయ్యారు. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు తీసే దర్శకుడితో చెయ్యాలని భావించారు. ఐతే, ‘జెర్సీ’ హిందీ రీమేక్ తీశాక గౌతమ్ తిన్ననూరి మీద చాలామందికి డౌట్స్ వచ్చాయి. హిందీలో ఆ సినిమా దారుణంగా పరాజయం పొందింది. అలాగే, బాలీవుడ్ లో పలు ఆఫర్లు ఇస్తామన్న నిర్మాతలు వెనక్కి తిరిగారు.

మరోవైపు, రామ్ చరణ్ గౌతం తిన్ననూరి ఇచ్చిన స్క్రిప్ట్ నేరేషన్ మొత్తం విన్నాక ఇప్పుడు ఆ సినిమా చెయ్యడం సరైనది కాదని భావించాట్ట. ముఖ్యంగా గౌతమ్ చెప్పిన కథలో సెకండాఫ్ లో సమస్యలున్నాయట. “ఆర్ ఆర్ ఆర్” తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇలాంటి టైంలో సరైన అడుగులు వెయ్యకపోతే ప్రాబ్లం. అందుకే, అది పక్కన పెట్టారట.

గౌతమ్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చని అంటున్నారు. ఆ స్థానంలో మరి దర్శకుడి కోసం వెతుకుతున్నారు. చర్చలు జరుగుతున్నాయి.

రామ్ చరణ్ త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వొచ్చు.

 

More

Related Stories