అమెరికాలో చరణ్ కి యమా క్రేజ్!

- Advertisement -

అమెరికాలో రామ్ చరణ్ సందడి మామూలుగా లేదు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మాండమైన స్పందన. హాలీవుడ్ జర్నలిస్టుల నుంచి సెలెబ్రిటీల వరకు చరణ్ తో ఫోటోలు దిగడం, ముచ్చటించడం కనిపిస్తోంది. ఐదు రోజుల్లో ఎన్నో ఈవెంట్స్ లో పాల్గొన్నాడు చరణ్.

మొదట ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత ‘ఏబీసీ న్యూస్’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అభిమానులతో ముచ్చటించారు. బేవెర్లీ హిల్స్‌లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో రామ్ చరణ్ సందడి చేశారు. ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డు అందుకున్నారు. అవార్డుల వేడుకలో రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకున్నారు.

హెచ్‌సీఏ అవార్డుల్లో ప్రజెంటర్‌గా ‘బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ను రామ్ చరణ్ అనౌన్స్ చేశారు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.

‘మగధీర’, ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగిన రామ్ చరణ్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై అందరి మనసులు గెలుచుకుంటున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్ అని పేర్కొన్నారు.

 

More

Related Stories