ఇకపై చిన్న షెడ్యూల్స్!

Ram Charan


రామ్ చరణ్ సినిమాని శంకర్ పూర్తిగా పక్కన పెట్టారు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ సినిమా ఆగిపోలేదు. అలాగని కొన్నాళ్ళూ పక్కన కూడా పెట్టలేదు. రామ్ చరణ్ కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే కానీ దర్శకుడు శంకర్ సినిమాని వదులుకోలేరు.

అందుకే, శంకర్ తాను “ఇండియన్ 2” షూటింగ్ కొన్నాళ్ళు, ఈ సినిమా కొన్నాళ్ళూ షూటింగ్ చేస్తాను అంటే రామ్ చరణ్ ఒప్పుకున్నారు. దానికి తగ్గట్లే ఇకపై చిన్న చిన్న షెడ్యూల్స్ తో ఈ సినిమా షూటింగ్ సాగుతుంది.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో జరుగుతోన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ రాజమండ్రిలో ఒక వారం రోజుల పాటు సాగుతుంది వచ్చే సోమవారం నుంచి. ఇకపై ఇలా వారం, పది రోజులు అటు, ఇటు తిరుగుతుంటారు శంకర్. ఇక్కడ ఒక షెడ్యూల్ పూర్తి చేస్తే, మరో షెడ్యూల్ ‘ఇండియన్ 2’ ఉంటుంది. “ఇండియన్ 2” షూటింగ్ ముగిసేవరకు ఇదే తంతు.

మరోవైపు రామ్ చరణ్ – శంకర్ సినిమా విడుదల కూడా మరింత ఆలస్యం కానుంది. వచ్చే వేసవి సెలవుల్లో విడుదల కాదు. కొత్త డేట్ వెతుక్కోవాలి.

రామ్ చరణ్, శంకర్, రామ్ చరణ్ శంకర్ మూవీ,

 

More

Related Stories