
సమ్మర్ వచ్చిందటే ఫారిన్ వెకేషన్ కి వెళ్లారు మన తెలుగు హీరోలు. మహేష్ బాబు ఇప్పటికే తన కుటుంబంతో కలిసి పారిస్ వెళ్లారు. ఈనెల 20న ఇండియాకి వస్తారు. ఇక రామ్ చరణ్, ఆయన భార్య కూడా మరో వెకేషన్ కి వెళ్లారు.
రామ్ చరణ్ భార్య ఉపాసన గర్భవతి. ఆమె బేబీ షవర్ (శ్రీమంతం లాంటిది) వేడుక మొన్నే దుబాయ్ లో జరిగింది. దుబాయ్ నుంచి మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది ఈ జంట. ఈ రోజు మాల్దీవులకు వెళ్లారు. కొద్దీ రోజులు అక్కడే వెకేషన్.
సాధారణంగా గర్భం దాల్చిన వారు ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకోరు. అలిసిపోవాల్సి వస్తుంది. కానీ, ఉపాసన, రామ్ చరణ్ మాత్రం జపాన్, ఆఫ్రికా, అమెరికా, దుబాయి, మాల్దీవులు …ఇలా వరుసగా ట్రావెల్ చేస్తున్నారు.
రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ మూవీ షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. దర్శకుడు శంకర్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. సో… ఈ ఖాళీ టైంలో ఇంట్లో కూర్చొని ఏమి చేస్తామని అనుకున్నారేమో మాల్దీవుల వెకేషన్ కి వెళ్లారు.