
హీరో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించింది. “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో ఆమె రామ్ చరణ్ కి భార్యగా కనిపించింది. ఆ సినిమా విడుదలైన నెల రోజుల్లోనే అలియా పెళ్లి జరిగింది. ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్, హీరో రణబీర్ కపూర్ ని పెళ్లాడింది అలియా. ఆ వెంటనే రణబీర్, అలియా ఓ పాప కూడా పుట్టింది.
ఇక ఈ రోజు కియారా అద్వానీ తన బాయ్ఫ్రెండ్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లాడింది. జైసల్మార్ లోని ఒక ప్యాలెస్ లో హిందూ సంప్రదాయ పద్ధతిలో కియరా, సిద్దార్థ్ మల్హోత్రా వివాహం జరిగింది.
కియరా ఇంతకుముందు రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోంది ఆమె. ఇందులో రామ్ చరణ్ సరసన ఆమె హీరోయిన్. సో అలియాలాగే కియారాకి కూడా చరణ్ సరసన నటించగానే పెళ్లి ఘడియలు వచ్చేశాయి.
‘రంగస్థలం’ షూటింగ్ సమయంలోనే సమంతకి పెళ్లి అయింది. రంగస్థలం 2018లో విడుదల కాగా, 2017 అక్టోబర్ లో సమంత, నాగ చైతన్య పెళ్లి జరిగింది.
నిజానికి, కియరా అద్వానీ కానీ, అలియా కానీ రామ్ చరణ్ తో నటించడానికి, వారి పెళ్ళికి ఈ సంబంధం లేదు. కానీ యాదృచ్చికంగా అతనితో నటించగానే వారి పెళ్లి జరిగింది అంతే.