
లీగల్ సమస్యల నుంచి సులువుగానే బయటపడుతాను అని దర్శకుడు శంకర్ ధీమాగా ఉన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ లలో రామ్ చరణ్ తో మూవీ ఎలాగైనా మొదలుపెట్టాలని పట్టుదలగా ఉన్నారు శంకర్. ఐతే, రామ్ చరణ్ కి ఎదో ఓ మూల భయం ఉంది. ఈ కేసు ఇప్పట్లో తేలకపోతే తాను బుక్కవుతానని రామ్ చరణ్ కి తెలుసు. అందుకే, మరో ఆప్షన్ కూడా రెడీ చేసుకునే పనిలో ఉన్నాడు చరణ్.
చరణ్ నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’, ‘ఆచార్య’ సినిమాల పనులు ఆగస్టునాటికి మొత్తం పూర్తి అవుతాయి. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో భారీ పాన్ ఇండియా మూవీ చెయ్యాలనుకున్నాడు. కానీ లైకా సంస్థ శంకర్ కి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది. ‘భారతీయుడు 2’ సినిమా మొత్తం పూర్తి చెయ్యకుండా శంకర్ మరో సినిమా షూటింగ్ మొదలుపెట్టొద్దనేది లైకా వాదన.
ఈ కేసు మరో మూడు వారాలకు వాయిదా పడింది. దానికి తోడు, శంకర్ కి మరిన్ని కేసులు వచ్చి పడేలా ఉన్నాయి.
అందుకే, చరణ్ ముందు జాగ్రత్తగా ఇతర దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారట. కానీ పెద్ద దర్శకులు అందుబాటులో లేరు. చరణ్ ఇప్పుడు ఏమి చేస్తాడు అనేది ఆసక్తికరమే.