- Advertisement -

రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా గురించి ఇంకా అఫీసియల్ ప్రకటన లేదు. వంశి పైడిపల్లి ఇప్పటికే లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడు. కానీ దాన్ని ఫుల్ స్క్రిప్ట్ గా వంశీ పైడిపల్లి మార్చాలి. అప్పుడే… ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది తేలుతుంది.
ఈ గ్యాప్ లో రామ్ చరణ్ కి పలువురు దర్శకులు కలిసి స్టోరీస్ చెప్పారు. అందులో ఎవరికి ముందు ఓకే చెప్తాడో. ఆ దర్శకులు అందరూ టెన్షన్ లో ఉన్నారు.
అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరి, సందీప్ రెడ్డి వంగ.. ఇలా పలువురు దర్శకులు క్యూలో ఉన్నారన్నది నిజం. కానీ ఇవన్నీ కొలిక్కి రావాలంటే… మరో ఆర్నెళ్లు పడుతుందేమో. ఈ గ్యాప్ లో రాజమౌళి “ఆర్.ఆర్.ఆర్” పూర్తి చెయ్యాలి. అలాగే, తన డాడీతో కలిసి “ఆచార్య”లో నటించాలి.