
మెగాస్టార్ రామ్ చరణ్ కి టెన్సన్ మొదలైంది. అటు రాజమౌళి, ఇటు శంకర్ డైరెక్షన్లో బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేశాడు చరణ్. రాజమౌళి సినిమా “ఆర్ఆర్ఆర్” పక్కన పెడితే, శంకర్ సినిమా ఇప్పుడు డౌటులో పడింది. లైకా సంస్థతో శంకర్ లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు.
ఇప్పుడు రామ్ చరణ్ ఏమి చెయ్యాలి? శంకర్ లీగల్ సమస్య నుంచి బయటపడకపోతే ఎలా? శంకర్ తనతో సినిమా చెయ్యడం ఆలస్యమైతే చరణ్ వేరే సినిమా చూసుకోవాలి. ఇప్పటివరకు ఇతర దర్శకులతో చర్చలు మొదలుపెట్టలేదు చరణ్. ఇప్పుడు ఆప్సన్లు చూసుకోవాలి.
శంకర్ నుంచి క్లారిటీ వచ్చినా, రాకున్నా … చరణ్ ఇతర దర్శకులతో మాట్లాడి పెట్టుకోవాలి. ‘ప్లాన్ బి’ రెడీ చేసుకోవాలి. లేదంటే గ్యాప్ పెరుగుతుంది.
ఇది చదివారా?: శంకర్ 160 కోట్ల వివాదం తేలేనా!
ఇప్పటికే… “ఆర్ ఆర్ ఆర్” విడుదల వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. ‘ఆచార్య’ సినిమా విడుదల కూడా ఆగింది.