- Advertisement -

బాబాయి పవన్ కళ్యాణ్ అంటే రామ్ చరణ్ కి చాలా అభిమానం. పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ అని తేలగానే చరణ్ వెంటనే శంకరపల్లికి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ తన శంకరపల్లి ఫార్మ్ హౌస్ లోనే క్వారెంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది.
కానీ చరణ్ దగ్గరుండి బాబాయికి సరయిన వైద్యం అందేలా చూసుకుంటున్నాడట. అపోలో ఆసుపత్రి వైద్యులు ఎప్పటికప్పుడు పవన్ హెల్త్ ని చెకప్ చేస్తూ రామ్ చరణ్ కి అప్డేట్ చేస్తూ వస్తున్నారట.
మరోవైపు, రామ్ చరణ్ తన ‘ఆచార్య’ షూటింగ్ నిలిపివేశాడు. కరోనా కేసులు పెరుగుతుండడం, తన తండ్రి చిరంజీవి వ్యక్తిగత సిబ్బందికి కూడా కరోనా సోకడంతో గత వీకెండ్ ‘ఆచార్య’ షూటింగ్ ని ఆపివేశారు. ఈ నెల 20 వరకు జరగాల్సిన పాట చిత్రకరణ ఆగిపోయింది.