మళ్ళీ అయ్యప్పదీక్షలో రామ్ చరణ్

- Advertisement -
Ram Charan

రామ్ చరణ్ కి భక్తి ఎక్కువే. ప్రతి ఏడాది క్రమం తప్పకుండ అయ్యప్పమాల వేసుకుంటారు. ఇంకొన్ని దీక్షలు కూడా చేస్తారు. తాజాగా అయ్యప్పమాల ధరించారు.

రామ్ చరణ్ షూటింగ్ లతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది అక్టోబర్, నవంబర్ లలో అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. ఈసారి కొంత ముందే తీసుకున్నారు. ఎందుకంటే కూతురు ఇంటికి వచ్చింది.

కూతురు క్లిన్ కారా అమ్మమ్మ ఇంటి నుంచి తమ ఇంటికి వస్తున్న శుభవేళ రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష బూనారు. రామ్ చరణ్ భార్య ఉపాసన ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ తర్వాత ఉపాసన మూడు నెలలు తల్లిగారి ఇంటి వద్దే ఉన్నారు. ఇటీవలే భర్త దగ్గరికి వచ్చారు ఉపాసన కూతురితో.

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న “గేమ్ ఛేంజర్” షూటింగ్ దశలో ఉంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న కొత్త చిత్రం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

 

More

Related Stories